అఖిల్-అభి ఒక్కటయ్యారు!

279
monal
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా 48 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఏ ఎలిమినేషన్ వచ్చినా,లవ్ టాస్క్ ఇచ్చిన హాట్ టాపిక్‌గా ఉండేది అభిజిత్,అఖిల్,మోనాల్. ముఖ్యంగా హౌస్‌లోకి ఎంటరైన దగ్గరి నుండి వీరిద్దరూ మాట్లాడుకున్నది తక్కువ…పొట్లాడుకుందే ఎక్కువ. ప్రతివారం ఎలిమినేషన్‌లో ఎవరూ ఎవరిని ఎలిమినేట్ చేసినా చేయకపోయినా వీరిద్దరూ మాత్రం పరస్పరం ఎలిమినేషన్‌ చేసుకున్న సందర్బాలే ఎక్కువ.

అయితే 48వ ఎపిసోడ్‌లో మాత్రం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక‌రి మీద ఒక‌రు జోకులు వేసుకోవ‌డంతో పాటు ఇద్ద‌రూ క‌లిసి మోనాల్‌పై పంచులు వేశారు.ఇక ఒక గొడ‌వ‌లో అయితే అఖిల్… అభికి స‌పోర్ట్ చేశాడు. ఇక అభి.. అఖిల్‌, మోనాల్‌కు ల‌వ్ సీన్లు ఎలా చేయాలో వివ‌రించడం గ‌మ‌నార్హం. మొత్తంగా బ్లాక్ బస్టర్ సినిమా సంగతి పక్కన పెడితే 48వ ఎపిసోడ్‌లో మాత్రం వీరిద్దరూ మాట్లాడుకోవడం హైలైట్.

- Advertisement -