బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 25 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కిల్లర్ కాయిన్స్ టాస్క్‌తో ఇంటి సభ్యులు బద్ధ శత్రువులుగా మారగా అమ్మ రాజశేఖర్ మాస్టర్…సొహైల్‌ల మధ్య రచ్చతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
వంట గదిలో హారిక దాచుకున్న కాయిన్స్‌ని సొహైల్ కొట్టేయగా కుమార్ సాయి దగ్గర కొట్టేసిన కాయిన్స్‌ని తిరిగి ఇచ్చేశారు దివి, రాజశేఖర్ మాస్టర్. ఇక హారిక-అభిజిత్‌లు చేతిలో చేయి వేసుకుని ఎప్పటిలాగే ముచ్చట్లు పెట్టారు. బయట కాయిన్స్ కోసం ఇంటి సభ్యులు దెబ్బలాడుతుంటే.. రాజశేఖర్ మాస్టర్,అఖిల్‌లు మిగతావాళ్ల కాయిన్స్‌ని కొట్టేశారు.
ఇంటి సభ్యులు పొందిన కాయిన్స్ అన్నింటిలో పవర్ కాయిన్ ఉందని అదే స్విచ్ కాయిన్ అని అన్నింటి కంటే ముఖ్యమైన కాయిన్ అని ప్రత్యేక ప్రయోజనం లభిస్తుందని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో తొలుత ఆ కాయిన్‌ని సంపాదించాడు మెహబూబ్. అదేదో పనికి రాని కాయిన్ అని మెహబూబ్ వదిలేయడంతో సుజాత తీసుకుని పవర్ కాయిన్‌ని సంపాదించింది.
తర్వాత సొహైల్, లాస్య, అరియానాలు ప్లాన్ చేసి మాస్టర్ కాయిన్స్ కొట్టేశాడు. హారిక.. మొహబూబ్ కాయిన్స్ కొట్టేసినా ఫలితం లేకపోయింది. ఇక కుమార్ సాయి కాయిన్స్ మొత్తం బెడ్ షీట్‌లో పెట్టుకుని నడుముకి కట్టుకుని పడుకోగా అవినాష్ దగ్గర కాయిన్స్‌ని కొట్టేశాడు సొహైల్. అయితే రాజశేఖర్ మాస్టర్ కాయిన్స్‌ని సొహైల్ కొట్టేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఇంతలో కిల్లర్ కాయిన్స్ తొలి దశ ముగిసిందని ఎవరిదగ్గర ఎంత ఉందో చెప్పాలని బిగ్ బాస్ అనడంతో.. ఇంటి సభ్యులు అంతా సంపాదించిన కిల్లర్ కాయిన్స్ లిస్ట్ చెప్పారు. ఈ ఫిజికల్ టాస్క్‌లో గంగవ్వ పాల్గొనలేదు. అందరికంటే తక్కువగా దివి 110 కాయిన్స్‌ని సంపాదించగా 4360 కాయిన్స్‌ని సంపాదించాడు మెహబూబ్.
తర్వాత కిల్లర్ కాయిన్స్ రెండోదశ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల దగ్గర ఉన్న కాయిన్స్‌ని లాక్కునే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో మరోసారి సొహైల్ -రాజశేఖర్ మాస్టర్ మధ్య గొడవ కొట్టుకోవడానికి వరకు వెళ్లింది. తర్వాత కిల్లర్ కాయిన్స్ వేటలో అవినాష్ కిందపడిపోవడం కాలుకు దెబ్బతాకడంతో డాక్టర్ రూమ్‌కు మోసుకోని వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
మొనాల్‌ని తెలుగులో మాట్లాడాలని మరోసారి హెచ్చరించాడు బిగ్ బాస్. దీంతో బోరున విలపిస్తూ తనకు అయిన గాయాలను బిగ్ బాస్‌కు చూపించింది మొనాల్ . దీంతో ఈ ఎపిసోడ్ ముగిసింది.