బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 17 హైలైట్స్

144
bigg boss 4

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 17 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇక ఈ వారం 7గురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ కాగా ఫిజికల్ టాస్క్‌, అభి బర్త్ డే వేడుకలు,మొనాల్‌తో అభి పులిహోర కలపడం హైలైట్‌గా నిలిచాయి.

ఉదయాన్నే వేకప్ సాంగ్‌కి సభ్యులు రచ్చరచ్చ చేయగా అరియినా అందాల ఆరబోతతో అదరగొట్టింది. ఇక ఎప్పటిలాగే అందరూ డ్యాన్స్‌లలో నిమగ్నమైతే అభి మాత్రం మొనాల్‌తో పులిహోర కలిపే పనిలో బిజీగా మారిపోయాడు. మార్నింగ్ మస్తీలో భాగంగా మోనాల్ ఇంటి సభ్యులందరికీ తెలుగు పద్యాలు నేర్పుతుందని బిగ్ బాస్ తెలపగా ఇంటి సభ్యులు తెగ ఎంజాయ్ చేశారు.

మొదట్లో కంట్రోల్‌లో ఉండాలని అవినాష్‌కు వార్నింగ్ ఇచ్చిన మొనాల్…ఈ ఎపిసోడ్‌లో పొగుడుతూ కనిపించింది. తర్వాత హలో గురూ ప్రేమకోసమేరా జీవితం అంటూ పాటపాడిన అవినాష్‌ మొనాల్ సో బ్యూటిఫుల్ అని ఆకాశానికెత్తేశాడు.ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఉక్కు హృదయం అనే టాస్క్ ఇచ్చారు. రోబోలు, మనుషులు రెండు టీంలుగా విడిపోయి సిల్వర్ బాల్ ఒకటి ఇచ్చి దాన్ని పగలకొడితే రోబోలు చనిపోయినట్టని అలా ఒక్కో రోబోను చంపితే మనుషులు విజేతలు అవుతారని తెలిపారు బిగ్ బాస్‌. గెలిచిన టీంలో నుండి ఒకరు కెప్టెన్ అవుతారని తెలిపారు.

మనుషుల టీం.. అఖిల్, మొనాల్, అమ్మా రాజశేఖర్, నోయల్, మొహబూబ్, దివి, సుజాత, సొహైల్‌లు కాగా.. రోబో టీంలో అభిజిత్, దేవి, లాస్య,అవినాష్, కుమార్, గంగవ్వ, హారిక, అరియానాలు ఉన్నారు. రెండు టీంలు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. రిల్వర్ బాల్‌కి గంగవ్వ కాపలాగా ఉండటంతో అంటువైపుగా వెళ్లడానికి చాలాసేపు ఆలోచించారు మనుషుల టీం. చివరికి సిల్వర్ బాల్‌ను పగలగొట్టడంతో మొదటిగా దేవి రోబో చనిపోయినట్టు అయ్యింది.

ఈ టాస్క్‌లో మనుషులు ఇంటి బయట ఉంటుండగా.. రోబోలు ఇంటిలో అన్ని సౌకర్యాలను వాడుకోవచ్చు. ఒకవేళ ఇంటి సభ్యులు ఫుడ్, వాష్ రూం తదితర సౌకర్యాలను వాడుకోవాలంటే రోబోలకు చార్జ్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంది. దీనిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోబోలకు చార్జ్ ఇవ్వడం ఇష్టం లేని మనుషులు వాష్ రూంకి పోవడం కోసం నానా ఇబ్బందులు పడ్డారు.

నోయల్ కెమెరాలను దిండుతో క్లోజ్ చేస్తే.. రాజశేఖర్ మాస్టర్, అకిల్‌లు బెడ్ షీట్లను పట్టుకుని నిలబడ్డారు. దివి, సుజాత, మొనాల్‌‌లు టాయ్‌లెట్‌ పోయడం బిగ్ బాస్‌కి ఆగ్రహం తెప్పించింది. కెమెరాలను క్లోజ్ చేయడం ఆటకు విరుద్ధమని ఇలా చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇక తర్వాత రోబో టీంలో అభి- అరియనా మధ్య పెద్ద గొడవ జరగడంతో ఎపిసోడ్ ముగిసింది.