ఐపీఎల్ 13..సీఎస్‌కేపై రాజస్ధాన్ ఘనవిజయం

302
rr
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై తొలి ఓటమిని చవిచూడగా రాజస్ధాన్ రాయల్స్ బోణి కొట్టింది. రాజస్దాన్ విధించిన 217 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై 200 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చెన్ననై ఓపెనర్లు ధాటిగా ఆడారు. సిక్స్‌లు,ఫోర్లతో విరుచుకపడ్డారు. తొలి వికెట్‌గా విజయ్-వాట్సన్ 56 పరుగులు చేయగా వాట్సన్ అవుటైన కాసేపటికే విజయ్ కూడా వెనుదిరిగాడు.

అయితే వన్‌డన్‌లో వచ్చిన డుప్లెసిస్‌(72; 37 బంతుల్లో 1 ఫోర్‌ 7 సిక్సర్లు), ఎంఎస్‌ ధోని(29 నాటౌట్‌; 17 బంతుల్లో 3 సిక్సర్లు)లు అలరించారు. డుప్లెసిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే, చివర్లో ధోని బ్యాట్‌కు పనిచెప్పాడు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాజస్తాన్‌ బౌలర్లలో తెవాతియా మూడు వికెట్లు సాధించగా, ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, టామ్‌ కరాన్‌లకు తలో వికెట్‌ తీశారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్ధాన్ ఆటగాళ్లు చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. సంజు సామ్సన్ ఏకంగా 8 సిక్స్‌లు బాధగా చివరి ఓవర్‌లో జోఫ్రా అర్చర్ 4 సిక్స్‌లతో అలరించాడు. మొత్తంగా రాజస్ధాన్‌ ఇన్నింగ్స్‌లో 17 సిక్స్‌లు ఉండటం విశేషం. శామ్సన్‌ 32 బంతుల్లో 1 ఫోర్‌,. 9 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(69; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్స్‌లు), ఆర్చర్‌ 8 బంతుల్లో 4 సిక్స్‌లతో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు.

- Advertisement -