బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 66 రోజులు పూర్తి చేసుకుంది. తాజా వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ సాగగా ఇంటి సభ్యులు అంతా సింగర్ రేవంత్‌నే టార్గెట్ చేశారు. దీంతో ఏడవడం ఒక్కడే మిగిలింది రేవంత్‌కి.
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులని రెండు టీమ్స్ గా స్నేక్, నిచ్చెన టీమ్స్ గా విడగొట్టిన సంగతి తెలిసిందే. ఇక తర్వాత కంటెస్టెంట్స్ కి నాగమణి అనే టాస్క్ ఇచ్చారు. ఒక టీంకి కొన్ని మణులని ఇచ్చి వాటిని కాపాడుకోవాలని చెప్పాడు బిగ్‌బాస్. మరో టీం వాళ్ళ దగ్గర్నుంచి ఆ మణులని లాక్కోవాలని చెప్పాడు.
ఇందులో భాగంగా అంతా రేవంత్ ని టార్గెట్ చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. ఒకర్నొకరు తోసేసుకొని, కాళ్ళు పట్టుకొని లాగేసుకొని నానా రచ్చ చేశారు. దీంతో రేవంత్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఎల్లో కార్డు ఇచ్చారు. ఈ సారి రెడ్ కార్డు ఇప్పించడానికి అందరు కలిసి ప్లాన్ వేశారని ఎమోషనల్ అయి ఏడ్చారు రేవంత్. చివరగా కెప్టెన్సీ టాస్క్‌లో ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, మెరీనాలు పోటీపడనున్నారు.
ఇవి కూడా చదవండి..

