కాంగ్రెస్‌కు షాక్.. బి‌ఆర్‌ఎస్ లోకి 12 మంది!

49
- Advertisement -

గత కొన్ని రోజులుగా టీకాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. పార్టీ నేతల మద్య ఆధిపత్య పోరు, అసమ్మతి సెగలు.. ఇలా చాలా రకాల కారణాలతో టీ కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇలా పార్టీలో రగులుకొన్న ముసలం కరణంగా చాలమంది నేతలు హస్తనికి బై బై చెప్పి ఇతర పార్టీల గూటికి చేరుతున్నారు. ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ వైపు కాంగ్రెస్ నేతల చూపు ఉన్నట్లు తెలుస్తోంది. కే‌సి‌ఆర్ అవినీతి రహిత పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో బి‌ఆర్‌ఎస్ కండువా కప్పుకునేందుకు టీ కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. .

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మేల్యేలు బి‌ఆర్‌ఎస్ గూటికి చేరడంతో టీకాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే అంతర్గత విభేదాలతో సతమతం అవుతున్న హస్తం పార్టీకి తాజాగా ఎమ్మేల్యేలు షాక్ ఇవ్వడంతో ములుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్లు అయింది. దాంతో కాంగ్రెస్ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. అయితే పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ అధిష్టానం మొయినాబాద్ పోలిస్ట్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ నుంచి మరికొంత మంది ఎమ్మేల్యేలు, నేతలు కూడా బి‌ఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి హస్తం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఫలితం మాత్రం కనిపించడం లేదు. చాలా రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న రేవంత్ రెడ్డి మరియు సీనియర్ నేతల మద్య విబేధాలు, అలాగే ఇటీవల దిగ్విజయ్ సింగ్ రాష్ట్రనికి వచ్చిన నేపథ్యంలో జరిగిన గొడవలు, అలాగే చాలా మంది నేతల వలసలు, ఇక తాజాగా 12 ఎమ్మేల్యేలు బి‌ఆర్‌ఎస్ లోకి చేరడం.. ఇలా చాలా పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్ బలాన్ని గట్టిగానే దెబ్బతిశాయి. మరి తీవ్రంగా బలహీన పడిన హస్తం పార్టీ తిరిగి కోలుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -