దేశానికి దారి దీపం కేసీఆర్..

46
niranjan
- Advertisement -

దేశానికి దారి దీపం కేసీఆర్ అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎనిమదో రోజు రైతుబంధు రూ.296.85 కోట్లు జమ చేయగా ఇందుకు సంబంధించి వివరాలను మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. లక్ష 69,709 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయని 5 లక్షల 93 వేల 717.02ఎకరాలకు నిధులు విడుదల చేశారు.

ఇప్పటి వరకు మొత్తం 54 లక్షల 70 వేల 637 మంది రైతులకు రూ.4031.07 కోట్లు జమచేయగా ఇప్పటి వరకు మొత్తం 54 లక్షల 70 వేల 637 మంది రైతుల ఖాతాలలో రూ.4327.93 కోట్లు జమ చేశారు. వ్యవసాయ రంగమే ఈ దేశ భవిష్యత్ అని..దానిని గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. వ్యవసాయరంగంలోనే ఉపాధి ఉందని, అత్యధిక శాతం మంది ప్రజానీకానికి ఉపాధి కల్పించగలమని నమ్మి ఎనిమిదేళ్లలో వ్యవసాయ రంగం అభ్యున్నతి కోసం రూ.3.50 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు.

దాని ఫలితమే వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి 2.49 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 3.50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాయన్నారు. వ్యవసాయమే ఈ దేశ భవిష్యత్ అని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -