భారీ భూకంపంతో తుర్కియే, సిరియా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం 4గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకూ సూమారుగా 1800మంది వరకు మరణించినట్టుగా తెలిపారు. ఈ భూకంపం దాటికి మృతుల సంఖ్య దాదాపుగా 10 వేలకు చేరే అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులు కాగా, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.
భూకంప విలయంపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కొలుకోవాలని మోదీ ప్రార్థించారు. విపత్కర పరిస్థితుల్లో ఆ దేశాలను ఆదుకునేందుకు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ లో 100మందితో కూడిన రెండు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, అవసరమైన పరికరాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపాలని నిర్ణయించారు.
వైద్య బృందాలు సహాయ సిబ్బందితో పాటు అవసరమైన మందులూ చేరవేయనున్నారు. తుర్కియే ప్రభుత్వం అంకారాలోని భారత రాయబాదర కార్యాలయం ఇస్తాంబులోని కాన్సులేట్్ జనరల్ కార్యాలయం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి…