కళ్యాణ్ రామ్ కి పోటీగా మెగాస్టార్

43
- Advertisement -

రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘అమిగోస్’. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ నటిస్తుంది. డాపుల్ గ్యాంగర్స్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన అమిగోస్‌పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని UA సర్టిఫికెట్ అందుకుంది. మనిషిని పోలిన మనుషులు స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం చాలా బాగుందట. సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చి, టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారని సమాచారం.

ఇక ఈ సినిమా సెన్సార్ విషయాన్ని మేకర్స్ చెప్పుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సినిమా గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం ఈ సినిమా రీరిలీజ్ కు సిద్దమవుతుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమాని పెద్ద ఎత్తున రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా రీరిలీజ్ కు ముందే కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ రిలీజ్ కానుంది. దీంతో చిరు సినిమా రీరిలీజ్ పై ఫ్యాన్స్ లో కాస్త అలజడి మొదలైంది. కళ్యాణ్ రామ్, చిరంజీవి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా?

బాలయ్య పశ్చాత్తాపం.. ఇక ఆపేయండి

ఓటీటీ : ఏ చిత్రం దేనిలో?

- Advertisement -