రివ్యూ: భీమ్లా నాయక్

495
pawan
- Advertisement -

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కాంబోలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకురాగా పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మ‌లయాళంలో 2020లో రూపొందిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ఆధారంగా భీమ్లా నాయ‌క్ తెర‌కెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా పవన్…భీమ్లా నాయక్‌తో ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.

కథ:

మిలిట‌రీ నుండి రిటైర్ అయిన డ్యానీ త‌న‌కు తిరుగులేని విధంగా ప్రవ‌ర్తిస్తూ ఉంటాడు. అదే ఊరికి స‌బ్ ఇన్ స్పెక్టర్ గా వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ తో డ్యానీకి చిక్కులు ఎదురవుతాయి. ఈ క్రమంలో డ్యానీని జైలుకు పంపడంతో వైరం మరింత ముదురుతుంది. తర్వాత భీమ్లా ఇంటిని డ్యానీ కూల్చివేయ‌డం, డ్యానీ కారును భీమ్లా పేల్చి వేయ‌డంతో గొడవ తారస్ధాయికి చేరుతుంది. తర్వాత ఏం జరుగుతుంది…?కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , రానా నటన, నిత్యా మీనన్,ఆకట్టుకునే సీన్స్‌, సెకండాఫ్‌లో పోరాట సన్నివేశాలు. పవన్ తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేశారు. భీమ్లా నాయక్ పాత్రలో ఒదిగిపోయారు. ఇకడ్యానీ పాత్రలో రానా జీవించారు. నిత్యమీనన్, స‌ముద్రఖ‌ని త‌మ పాత్రల‌కు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు సైతం ప‌రిధికి మించ‌కుండా న‌టించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌ నెమ్మదిగా సాగడం, అంత ఇష్టమేంద‌య్యా సాంగ్ సినిమాలో క‌నిపించ‌క పోవ‌డం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. తమ‌న్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా నేప‌థ్యసంగీతంతో మురిపించారు. ర‌వి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ క‌నువిందు చేస్తుంది. పాటలు బాగున్నాయి. మలయాళ సినిమాను తెలుగు నెటివిటీకి అనుగుణంగా తెరకెక్కించడంలో దర్శకుడు సాగర్ కె చంద్ర వందశాతం సక్సెస్ అయ్యారు. చినబాబు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

పవన్ గతంలో పోలీస్ ఆఫీసర్‌గా ఎన్నో సినిమాలు చేసిన భీమ్లా నాయక్ మాత్రం ఢిపరెంట్. మలయాళ ఒరిజిన‌ల్ తో పోలిస్తే భీమ్లా నాయ‌క్‌ను మ‌రింత రిచ్ గా చిత్రీక‌రించారు దర్శకుడు. పవన్,రానా నటన సినిమాకు ప్లస్ కాగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చే సినిమా భీమ్లా నాయక్.

విడుదల తేదీ:25/02/2022
రేటింగ్: 3/5
నటీనటులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా, నిత్యామీన‌న్
సంగీతం:తమన్
నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
ద‌ర్శ‌క‌త్వం: సాగ‌ర్ కె.చంద్ర‌

- Advertisement -