కొన్ని రోజుల క్రితం మలయాళ హీరోయిన్ భావన జీవితంలో జరిగిన సంఘటన సౌత్ సినీ పరిశ్రమ మొత్తాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. భావన మాజీ డ్రైవర్ మరికొందరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడి అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసిన డబ్బు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భావన ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురి మధ్యలో పెట్టి తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికైనా జరగొచ్చని.. ఇలాంటి ఇష్యూలను బయటపెట్టడానికి భయపడి తప్పు చేసినోళ్లకు తప్పించుకునే ఛాన్స్ ఎందుకివ్వాలంటూ ప్రశ్నించింది.. నేరం చేసినోళ్లే సిగ్గు పడాలని గట్టిగానే ప్రతిస్పందించింది.. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని స్పష్టం చేసింది భావన. తాజాగా తాను నటించిన ఓ టీవీ యాడ్‌లో తన ప్రస్తావన తీసుకొచ్చింది.
ఆ యాడ్‌లో మహిళలు ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా దృఢంగా ఉండాలంటూ ఓ డైలాగ్ చెప్తుంది భావన. అయితే ఈ యాడ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొందరేమో భావన అన్నీ మరిచిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది అంటుంటే మరికొందరు అసలు ఆ టీ యాడ్‌కి ఆమె చెప్పే డైలాగుకి పొంతన లేదని… వాణిజ్య ప్రకటనలో ఆమెకు జరిగిన సంఘటన గురించి ప్రస్తావించాల్సిన అవసరమేంటని కామెంట్స్ చేశారు. తనను కిడ్నాప్ చేసిన నిందితులకు శిక్షపడేలా చేస్తానని శపథం చేసి మరీ భావన నటనపై దృష్టిపెట్టింది.