ట్రూకాలర్‌ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్‌తో..

205
- Advertisement -

ట్రూకాలర్‌ ఆప్‌ తెలియని వారుండరు. అయితే ఇప్పటివరకూ ట్రూకాలర్‌ వల్ల ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆప్‌
మరిన్ని సరికొత్త ఫీచర్స్‌తో రెడీ అయిపోయింది.

ఇక నుంచి బ్యాంకింగ్ సేవలు, మొబైల్ రీఛార్జ్, వీడియో కాలింగ్ వంటి కొత్త ఆప్షన్లతో వచ్చేసింది ట్రూకాలర్‌. మారుతున్న కాలానికి అనుగుణంగా ట్రూకాలర్ కూడా తన సర్వీసులను మార్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ట్రూకాలర్ పే పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది.

  Truecaller's latest feature wants to make your phone number your ..
యాప్‌లో ‘సెండ్ మనీ త్రో యూపీఐ’ అనే అప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే చాలు ఓ యూపీఐ ఐడీ క్రియేట్‌ అవుతుంది. దీని ద్వారా మొబైల్ రీఛార్జ్‌లు చేసుకోవచ్చు. అంతేకాకుండా అది క్లిక్ చేస్తే ఎవరికీ డబ్బులు పంపించాలనుకుంటున్నారో వారి యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్ అడుగుతుంది.

వాటిని టైప్ చేసి డబ్బులు కూడా ‘పే’ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పిన్ నంబర్ అడుగుతుంది. ఆ పిన్ నంబర్ టైప్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతోంది. మీరు పంపించాలనుకున్న వ్యక్తికి సులువుగా డబ్బు పంపవచ్చు.  ఇవే కాకుండా ట్రూకాలర్‌లో వీడియో కాల్స్ కూడా చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చింది.

  Truecaller's latest feature wants to make your phone number your ..

గూగుల్‌ వీడియో కాలింగ్‌ యాప్ డ్యుయోతో కలసి ట్రూకాలర్‌ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాదు నెట్ లేకున్నా కూడా ట్రూకాలర్ పనిచేయనుంది. ట్రూకాలర్ ఎయిర్‌టెల్‌తో కలిసి ‘ఎయిర్‌టెల్ ట్రూకాలర్ ఐడీ’ ఆఫ్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏదైనా ఎయిర్‌టెల్ నంబర్ నుంచి కాల్ వస్తే ఇంటర్నెట్ లేకపోయినా ఆ వ్యక్తి వివరాలు తెలిసిపోతాయన్నమాట. సో ఇక నుంచి డిజిటలైజేషన్‌ కి తగ్గట్టు ట్రూకాలర్‌ అన్నివిధాలుగా ఉపయోగపడనుందనే చెప్పాలి.

- Advertisement -