భావనకు బాసటగా సౌత్‌ ఇండస్ట్రి…

268
Bhavana is brave - Its so Sad
- Advertisement -

ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులను, సామాన్య ప్రజలను కలిచివేస్తోంది. కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఆ ఘటనను ఖండిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అంతా భావనకు  అండగా నిలుస్తున్నారు.

తాజాగా కన్నడ స్టార్‌ హీరో  సుదీప్‌, తమిళ నటుడు విశాల్‌ నిందితులపై నిప్పులు చెరిగారు.ఇలా లైంగిక వేధింపులకు పాల్పడే వారిని తుపాకీతో కాల్చి చంపాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు విశాల్. ఇలాంటి ఘటన గురించి ధైర్యంగా బయటకు చెప్పడం ఎంతో గొప్ప విషయమని …. ఎంతో భద్రత ఉండే సెలబ్రిటీకే ఇలా జరిగితే  ఇక సామాన్య స్త్రీ పరిస్థితి ఏంటని  విశాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రికి లేఖ పంపుతామని తెలిపారు.

పర స్త్రీకి గౌరవం ఇవ్వలేని వ్యక్తి.. తన తల్లికి, చెల్లికి కూడా గౌరవం ఇవ్వడని  అలాంటి వాడు ఈ సమాజానికి అనవసరం సుదీప్ పేర్కొన్నారు. శారీరకంగా బలవంతుడినని నిరూపించుకునేందుకు ఇలాంటి మానవ మృగాలు అప్పుడప్పుడు చెలరేగుతుంటాయి. త్వరగా విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశాడు.

ట్విట్టర్ ద్వారా భావనను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పిన సమంత…నువ్వెంతో ధైర్యవంతురాలివి, నువ్వు మళ్లీ కార్యరంగంలోకి దూకాలి అంటూ స్వాంతన వ్యాఖ్యాలు ట్వీట్ చేసింది. ఈ ఘటన గురించి వినగానే తన గుండె బద్దలైందని  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నానని తెలిపింది బాలీవుడ్ నటి శ్రధ్ధా కపూర్. హీరో సిద్ధార్థ్ దీనిపై స్పందిస్తూ…ఆమె వెంట ఉంటానని తెలిపాడు.

సోషల్ మీడియాతో సహా దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తం ఆమె ధైర్యానికి శభాష్ అంటోంది. అండగా మేమున్నామని భరోసా ఇస్తోంది. ఒక్క మలయాళంలో తప్ప దక్షిణాదిలో ఆమె నటించిన చిత్రాల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టగలిగినవే. తెర అవకాశం సులభంగానే వచ్చినా తన ప్రతిభ,నటనతో మంచి పేరు సంపాదించుకుంది భావన. కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా రెండుసార్లు అవార్డులు సాధించింది.

2006లో టాలీవుడ్‌లో ఒంటరి, మహాత్మా వంటి సినిమాల్లో నటించింది భావన.  ఎవరికీ భయపడదు. తనకి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటుంది. నిర్మొహమాటి ఇది భావన వ్యక్తిత్వం. ఇప్పుడు ఆ వ్యక్తిత్వమే భావనకు ఎల్లలు లేని ప్రేమ, మద్దతు లభిస్తోంది.

- Advertisement -