కీరవాణిపై రచయితల ఫైర్‌

245
Bhaskarabhatla fire Keeravani Comments
- Advertisement -

‘బాహుబలి’ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అందరి చేతా మన్ననలు పొందిన సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి. అయితే ‘బాహుబలి-2’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు కొద్ది గంటల ముందు ఆయన చేసిన ట్వీట్లు విమర్శల పాలవుతున్నాయి.కీరవాణిని ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి.

ట్విట్టర్ లో కీరవాణి ‘తెలుగులో బుర్రతక్కువ దర్శకులు పెరిగిపోయారు… ఇక గీత రచయిత విషయానికి వస్తే వేటూరి సుందరరామ్మూర్తి చనిపోయిన తర్వాత, సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిని దర్శకులు సీరియస్ గా తీసుకోలేదు కానీ, గీత రచయితలు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు.

అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణిగారే కాపాడగలరు. అయిదే నిమిషాలైతే అది సరిపోద్ది’ (‘విక్రమార్కుడు’ సినిమా కోసం కీరవాణి రాసిన ఓ పాటలోని లైన్‌)…’ అంటూ ట్వీట్ చేస్తూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.  ‘ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలోనే కాకుండా వేరే సంగీత దర్శకులకీ పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నా. వేటూరి, సిరివెన్నెల తర్వాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణిగారేన’ని మరింత వ్యంగ్యాన్ని జోడించాడు.

మంచి సందర్భం ఉంటే ఇప్పటి గీత రచయితలు కూడా అద్భుతంగా రాయగలరని… చెత్త సన్నివేశం ఇస్తే సిరివెన్నెల కూడా చెత్తగానే రాస్తారని అన్నాడు రామజోగయ్య శాస్త్రి. కాగా, ఆ వేడుకలో ‘జనతాగ్యారేజ్‌’ సినిమాలోని ‘ప్రణామం’ పాటకు ఉత్తమ గీత రచయితగా ఆయన అవార్డు అందుకున్నాడు.

Bhaskarabhatla fire Keeravani Comments

- Advertisement -