హ్యాట్రిక్‌ ‘ఫిఫ్టీ’ కొట్టిన పవర్ స్టార్

188
Katamarayudu box-office collections

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమా విడుదలై మొదటి రోజు మంచి వసూళ్ళు రాబట్టుకుంది.పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు. మార్చి 24న విడుదలైన కాటమరాయుడు కలెక్షన్ల సునామీ కొనసాగిస్తునే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను భారీ వసూళ్లను సాధిస్తోంది.

తొలి వారాంతంలో ఈ సినిమా 43 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఆ తరువాత ఉగాది రోజు వసూళ్లతో కలుపుకుని 50 కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది. ఈ వీకెండ్ లో మళ్లీ కలెక్షన్స్ పుంజుకోవచ్చనీ, ఆదివారం వసూళ్లతో కలుపుకుని ఈ సినిమా 60 కోట్లకి చేరువ కావొచ్చని అంటున్నారు.

సినిమా టాక్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం 50 కోట్ల షేర్ వచ్చి పడాల్సిందన్నమాటే. తొలిసారి ‘గబ్బర్ సింగ్’తో రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకున్న పవర్ స్టార్.. ఆ తర్వాత నాలుగేళ్ల కిందట ‘అత్తారింటికి దారేది’ సినిమాతో మరోసారి ఆ మార్కును దాటాడు. ఆ చిత్రం రూ.85 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇక అప్పట్నుంచి పవన్ అలవోకగా రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకుంటున్నాడు. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ అయినా సరే.. రూ.50 కోట్ల షేర్ మార్కును దాటింది. ఇప్పుడు ‘కాటమరాయుడు’ సైతం డివైడ్ టాక్ లోనూ ఈ ఘనతను అందుకుంది. దీంతో వరుసగా మూడు 50 కోట్ల షేర్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు పవన్.