ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మరోసారి తమ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. ఇప్పటికే ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్స్‌ను దాదాపు 50శాతం మేర పెంచిన ఎయిర్‌టెల్.. ఇప్పుడు ప్రీపెయిడ్ కనీస రీఛార్జీ మొత్తాన్ని దాదాపు రెట్టింపు పెంచి వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది.
తాజాగా ఎయిర్‌టెల్ అన్ లిమిటెడ్ కాలింగ్ టారీఫ్‌లో 84 రోజులు ఉన్న ప్లాన్‌ను 56 రోజులకు కుదించి.. 28 రోజుల వ్యవధిని కట్ చేసింది. ఈ మార్పుచేసి వారం రోజులు కూడా కాలేదు.. అప్పుడే మరో షాకింగ్ న్యూస్ తెలిపింది ఎయిర్ టెల్. ఇప్పటి వరకు రూ.23 ధరను.. దాదాసే 95 శాతం పెంచేసింది.
ఇక ఈ ప్లాన్ ధరను రూ.45 చేసింది. అంతేకాదు, పెంచిన ధర ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఎయిర్‌టెల్ కస్టమర్లు ఇక నుంచి రూ.23కు బదులు రూ.45 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెల వినియోగదారుడు రూ.22 అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే గడువు మాత్రం యథావిధిగా 28 రోజులు కొనసాగనుంది.