భారత సైన్యంలో మరో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. తొలిసారిగా ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి ఐదుగురు మహిళ సైనికాధికారులను నియమించింది. చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకడామీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివారం ఆర్టిలరీ రెజిమెంట్‌కు నియమించారు. వారు లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పవిత్రా మౌద్గిల్‌లను నియమించినట్టు వెల్లడించారు. వీరిలో ముగ్గురిని చైనా సరిహద్దులో మోహరించిన యూనిట్లలో మిగిలిన ఇద్దరిని పాక్ సరిహద్దులో నియమించారు.
Also Read: మోడి విషసర్పమా.. గరళకంఠుడా ?
ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆర్టిలరీ యూనిట్లలో మహిళలను నియమిస్తామని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ పరేడ్ జరిగింది. 189 క్యాడెట్స్ శిక్షణ పొందగా.. ఇందులో భూటాన్‌కు చెందిన 29 మంది క్యాడెట్స్ ఉన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌ను బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్ ఎస్‌ఎం షఫీయుద్దీన్ అహ్మద్ సమీక్షించి, క్యాడెట్స్‌ను అభినందించారు.
Also Read: ” కలిసుంటే కలదు సుఖం “.. కాంగ్రెస్ కొత్త ఫార్ములా !