NBK 108:భగవత్ కేసరి

117
- Advertisement -

అఖండ ఇచ్చిన సక్సెస్‌తో వరుస సినిమాలకు కమిట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 తెరకెక్కుతోంది. బాలయ్య బాబు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూర్తి తెలంగాణ యాసలో ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే..?

ఇక తాజాగా సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్త టీ టౌన్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు‘భగవత్ కేసరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో భగవత్ కేసరి చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అంట. అందుకే ఈ పేరునే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ అఫిషియల్‌గా ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే..

Also Read:Nargis Dutt: బర్త్ డే స్పెషల్

- Advertisement -