Mahesh:గుంటూరు కారం..ఫ్యాన్స్‌కి నిరాశే

40
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా తెరకెక్కుతన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కాగా మహేష్ కెరీర్‌లో 28వ సినిమా. ఇక కృష్ణ బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ని రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంది.ఈ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ ని ప్రకటించింది చిత్రయూనిట్.

టైటిల్‌కి సంబంధించి అప్డేట్ ఇచ్చాక వచ్చే రెండు నెలల దాకా ఈ సినిమా అప్డేట్ ఏమి ఉండదని నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. సూపర్ ఫ్యాన్స్.. థియేటర్స్ లో టైటిల్, గ్లింప్స్ కు మీరిచ్చిన రెస్పాన్స్ పండగలా ఉంది. థియేటర్స్ కి వచ్చిన వాళ్లందరికీ థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఆగస్టు 9వ తేదీన ఇస్తామని వెల్లడించారు.

Also Read:Nargis Dutt: బర్త్ డే స్పెషల్

అంటే సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రావాలంటే ఆగస్టు 9 మహేష్ బర్త్ డే వరకు వేచిచూడాల్సిందే. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందగా గుంటూరు కారం సినిమా వచ్చే సంక్రాంతి 2024 జనవరి 13న రిలీజ్ కానుంది.

- Advertisement -