బొల్లి మచ్చలకు పరిష్కారం ఉందా?

104
- Advertisement -

బొల్లి మచ్చలు అనేది ఒక రకమైన చర్మవ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారికి చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడి చర్మం పాలిపోయినట్లుగా మారుతుంది. ఈ బొల్లి మచ్చల కారణంగా చాలామంది నలుగురిలో తిరగలేక ఎంతో మధన పడిపోతుంటారు. ఆత్మస్థైర్యం కోల్పోయి బయట తిరగడానికి కూడా ఇష్టపడరు. శరీరంపై ఉండే మెలనోసైట్స్ దెబ్బ తినడం వల్ల అక్కడ మెలనిన్ కణాలు మృతి చెంది బొల్లి మచ్చలుగా ఏర్పడతాయి. ఈ బొల్లి మచ్చలలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సెగ్మెంటల్ మరోటి నాన్ సెగ్మెంటల్.. శరీరంపై కేవలం ఒకే చోట ఈ బొల్లి మచ్చలు ఉంటే దానిని సెగ్మెంటల్ అంటారు. అలా కాకుండా శరీరంపై ఇతర భాగాలలో అంటే తల, మెడ, ముఖం, కళ్ళు, కాళ్ళు, చేతులు.. ఇలా ఆయా భాగాలలో ఈ బొల్లి మచ్చలు ఏర్పడితే నాన్ సెగ్మెంటల్ అంటారు..

ఈ బొల్లి మచ్చలు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తి, విటమిన్ బి12 లోపించినా, థైరాయిడ్, మధుమేహం, అలోపేషియా, సోరియాసిస్.. వంటి వ్యాధుల తీవ్రత పెరిగిన బొల్లికి దారి తీస్తుంది. దీన్ని చాలమంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. అయితే బొల్లి ఎక్కువగా ఉంటే అది ఇతర వ్యాధులకు మూలం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుయితున్నారు.

కాబట్టి దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించడం ఎంతో మేలు. ఇది దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సరైన వైద్యం తీసుకుంటూనే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బీ విటమిన్ పుష్కలంగా ఉండే ఆకు కూరలను ఎక్కువగా తినాలి. ఇంకా ఐరన్ అధికంగా ఉండే క్యారెట్, బీట్ రూట్, నారింజ వంటి పండ్లను తినాలి. వీటన్నిటికి మించి దీని బారిన పడిన పడిన వారు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఉండాలి. ఎందుకంటే దీని నివారణలో మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. కాబట్టి బొల్లి విషయంలో అదైర్య పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ తీసుకుంటే దీని నుంచి బయట పడవచ్చు.

Also Read:గుడ్డులోని పచ్చసోనా తింటే ప్రమాదమా?

- Advertisement -