భూతద్ధం భాస్కర్ నారాయణ..టికెట్‌ లాంచ్

8
- Advertisement -

పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో యువ న‌టుడు శివ కందుకూరి ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సినిమా బిగ్ టికెట్‌ను రిలీజ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

కర్ణాటక ఆంధ్ర బోర్డర్‌లో జరిగిన వ‌రుస‌ హత్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ హత్యలు ఎవ‌రు చేశారు అని క‌నిపేట్టే డిటెక్టివ్ భాస్కర్ నారాయణ పాత్ర‌లో శివ కందుకూరి న‌టిస్తున్నారు.

Also Read:కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసా!

- Advertisement -