నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కోడలుగా మారిన సమంత రూత్ ప్రభు అలియాస్ అక్కినేని సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే సమంత ఎప్పటికప్పుడు తన మూవీ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. దీంతో అమ్మడుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. పెళ్లి తర్వాత సమంత మొదటి సారిగా తన ఆలోచనలను, అనుభవాలను పంచుకుంది.
అక్కినేని ఇంటి కోడలినైనందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని, ప్రస్తుతం తన సంతోషానికి అవధులు లేవని పేర్కొంది సమంత. తనను అర్ధం చేసుకునే భర్త దొరకడం కంటే అదృష్టం ఇంకా ఏం ఉంటుందని చెప్పుకొచ్చింది సమంత. పెళ్లి తర్వాత తాను ఏం మారనని, తనకు నచ్చిన సినిమాలను చేస్తూనే ఉంటానని, సినిమాలు చేయడానికి తమ ఫ్యామిలి ఏం అడ్డు చెప్పదని, తనను సినిమాలు చేయాలని అక్కినేని ఫ్యామిలి సపోర్టు చేస్తుందని సమంత పేర్కొంది. తన జీవితంలో రెండు సార్లు పెళ్లి చేసుకుంటానని అనుకోలేదని, నాగ చైతన్య, నేను రెండు సార్లు పెళ్లి చేసుకున్నామని, తామిద్దరం ఏం మాయ చేసావే సినిమాలో కూడా రెండు సార్లు పెళ్లి చేసుకున్నామని, సినిమాలో ఒకసారి, నిజజీవితంలో ఒకసారి పెళ్లి చేసుకున్నామని చెప్పింది సమంత.
తమ లవ్ స్టోరిని సినిమాగా తీయడానికి ఎటువంటి నిబంధనలు లేవని క్లారిటి ఇచ్చింది సమంత. తమ హనిమూన్ గురించి ఇంకా ఏం అనుకోలేదని, తాను ప్రస్తుతం సావిత్రి సినిమా షూటింగ్ లో పాల్గొంటు బిజీగా ఉన్నానని చెప్పింది సమంత.