బాలకృష్ణకు పోటిగా పవన్…

204
Pawan-Kalyan-Balakrishna
- Advertisement -

సంక్రాంతి పేరు చెప్పగానే తెలుగువారికి ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడిపందేలు, గాలిపటాలే కాదు తెలుగు సినిమా కూడా గుర్తుకు వస్తుంది. తెలుగు చిత్రరంగానికి సంబంధించినంతవరకూ సంక్రాంతి పెద్ద సీజన్. తొలి పరీక్ష. కోట్లాది రూపాయలు గుమ్మరించి తీసే చిత్రాల జాతకాన్ని పరీక్షించుకొనే సందర్భం. సంక్రాంతికి విడుదలైన తమ సినిమా హిట్‌ అయితే ఇక ఆ ఏడాదంతా తమ కెరీర్‌కు ఢోకా లేదని హీరోలు భావిస్తుంటారు. అందుకే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఆ రేసులో పాల్గొని తమ సత్తా చాటుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.

Pawan-Kalyan-Balakrishna

ఏటా సంక్రాంతి నాటికి కనీసం రెండు మూడు కొత్త సినిమాలు థియేటర్లలో కనిపిస్తుంటుంది. ఈ సీజన్ లో సినిమా హిట్టయితే కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. ఈ సీజన్ పై సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందుకే ఈ పండగకు సినిమా రిలీజయ్యేలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – బాలకృష్ణలు పోటే పడే అవకాశం కనిపిస్తోంది. వీళ్లిద్దరి సినిమాలు రిలీజ్ డేట్ ఎప్పుడనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనప్పటికీ ఆయా సినిమాల నిర్మాతలు ఆ టైంకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Pawan-Kalyan-Balakrishna

అటు బాలయ్య  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను కూడా   సంక్రాంతి బరిలో నిలిపాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ, నయనతార, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్‌ భట్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సంక్రాంతికి  పవన్ కల్యాన్, బాలయ్యల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో  బాలయ్య, పవన్ ల  మధ్య ఆసక్తికర పోటీ అనివార్యంగా మారుతుందా అన్న చర్చ మొదలయ్యింది.

- Advertisement -