గ్యాస్ సమస్యలను దూరం చేసే ‘యోగముద్రాసనం’!

29
- Advertisement -

ప్రతిరోజూ ఎన్నో పని ఒత్తిళ్ళ కారణంగా టైమ్ కి ఆహారం తినడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఇలా టైమ్ కి భోజనం చేయకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య తలెత్తుతాయి. ముఖ్యంగా ముఖ్యంగా గ్యాస్, అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపులో గ్యాస్ చేరడం వల్ల కడుపు నొప్పి, ఊపిరితిత్తుల దగ్గర మంట ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ఉదర సమస్యలన్నిటికి కూడా యోగాలో చక్కటి పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ సమస్యలను తగ్గించడంలో ” యోగ ముద్రాసనం ” ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ ఆసనంలో కడుపు భాగాన్ని లోపలికి నొక్కి ఉంచాల్సి వస్తుంది. తద్వారా ఉదర సమస్యలన్నీ దూరమై కడుపు భాగం శక్తివంతం అవుతుంది. ఇక ఈ ఆసనం ద్వారా వెన్ను నొప్పిని కూడా తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక కు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది.

యోగ ముద్రాసనం వేయు విధానం

ముందుగా నేలపై దుప్పటి లేదా యోగా షీట్ వేసుకొని దానిపై పద్మాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత రెండు చేతులను వీపు వెనుకవైపుకు తీసుకెళ్లి ఎడమచేతితో కుడి చేతి మణికట్టు పట్టుకొని రెండు చేతులను సాగదీసుకుంటూ నడుము మరియు వెన్నెముక కలియు స్థానం పైకి తీసుకురావాలి. శ్వాసను కంట్రోల్ లో ఉంచి శరీరాన్ని ముందుకు వంచి భూమిపై ఆధారపడలి. తర్వాత క్రమక్రమంగా తల పైకి లేపుతూ శరీరాన్ని మరలా నిటారుగా చేయాలి. ప్రారంభంలో ఈ ఆసనం కష్టతరంగా అనిపించినప్పటికి నెమ్మదిగా ఈ ఆసనం అలవాటుగా మారుతుంది. ఈ ఆసనాన్ని సుఖాసనం లేదా సిద్దసనం లో కూడా వేయవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -