vrischikasana:వృచ్చికాసనం వేస్తే ఏమౌతుందో తెలుసా?

32
- Advertisement -

ప్రతిరోజూ యోగా సాధన చేసే వారికి వృచ్చ్హికాసనం గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. యోగాలోని కష్టతరమైన ఆసనాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆసనం తేలు ఆకారాన్ని పోలి ఉంటుంది అందుకే వృచ్చికాసనం అంటారు. ఈ ఆసనం ఎంతో సాధనతో కూడుకున్నది. శరీరం ఫ్లెక్సిబిలిటీగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఆసనం వేయాలి.

ఉపయోగాలు
వృచ్చికాసనం ప్రతిరోజూ వేయడం వల్ల ఊపిరితిత్తులకు మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది, వెన్నెముక సాగదీతకు గురై ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సప్తనాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. పొట్ట యండలి కొవ్వు కరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడి.. మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి..ముఖ్యంగా లంబెగో వంటి వివిధ రకాల వెన్ను సమస్యలు దరి చేరావు. కాళ్ళకు పటుత్వం పెరుగుతుంది.

వేయు విధానం

ముందుగా శీర్షాసనంలోకి శరీరాన్ని తీసుకొచ్చి ఆ తరువాత కాళ్ళను, వెన్నుపామును పూర్తిగా వెనుకకు వంచాలి. ఆ తరువాత తలపై ఉన్న బరువంత నెమ్మదిగా చేతుల మీద ఉంచుతూ తలను వీలైనంతా వెనుకకు వంచాలి. ఈ సమయంలో చేతులు ఫోటోలో చూపిన విధంగా స్థిరంగా ఉంచాలి.ఆ తరువాత వీలైనంత వరకు తల మరియు కాళ్ళు దగ్గరకు వచ్చేలా చేయాలి. అప్పుడు ఈ ఆసనం తేలును పోలినట్లు కనిపిస్తుంది.

జాగ్రత్తలు

ఈ ఆసనం ఎంతో జాగ్రత్తగా వేయాల్సిన ఆసనం. శరీరం బిగుతుగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం అసలు వేయరాదు. ఇంకా వెన్ను పూస, నడ్డి పూసలు బిగుతుగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం వేయరాదు. ఒకవేళ వేస్తే యోగా నిపుణుల పర్యవేక్షణలోనే వేయాల్సి ఉంటుంది. లేదంటే నడుము విరిగే అవకాశాలు ఎక్కువ.

ఇవి కూడా చదవండి..

- Advertisement -