కంగనా..ప్రభాస్ వండర్‌ఫుల్ హోస్ట్‌

47
- Advertisement -

నిత్యం కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో ఉండే క్వీన్…ఇటీవలే చాలా స్వీట్‌గా సింపుల్‌గా మాట్లాడి…ఔరా అనిపించింది. కంగనా రనౌత్ తెలుగులో ఒకేఒక్క సినిమా చేసింది. 2009లో వచ్చిన ఏక్‌నిరంజన్‌లో డార్లింగ్‌తో కలిసి నటించింది. అయితే ఈ సినిమా అంతగా మంచి టాక్‌ తెచ్చుకోలేకపోయింది. ఇటీవలే ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ సెషన్‌లో పాల్గొంది. ప్రభాస్‌తో ఉన్న స్వీట్ మెమొరీని షేర్ చేసుకోవాలని కంగనాని ఓ ఫాలోవర్ అడిగారు. దీనికి కంగనా స్పందిస్తూ…ప్రభాస్ ఇంట్లో ఎప్పటికీ బెస్ట్‌ ఫుడ్‌ ఉంటుంది. ప్రభాస్ ఒక అద్భుతమైన హోస్ట్‌ అని సమాధానిమిచ్చింది. దీంతో కంగనా పొగడ్తలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం కంగనా చంద్రముఖి2లో నటిస్తోంది. మరో వైపు ప్రభాస్ బ్యాక్‌ టు బ్యాక్‌ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్‌కే సలార్ ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

కాంతార-2లో రజినీకాంత్‌..!

పిక్ టాక్ :శృతిమించిన సొగసుల మయం

ప్రారంభోత్సవం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

- Advertisement -