హంసల దీవిలో బెల్లంకొండ ఫైట్ !!

105
Bellamkonda Sreenivas – Boyapati Srinu – Dwaraka Creations Production No 2 New Action Schedule In Hamsala Deevi
Bellamkonda Sreenivas – Boyapati Srinu – Dwaraka Creations Production No 2 New Action Schedule In Hamsala Deevi

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయ్, ఏప్రిల్ 21 నుంచి సరికొత్త షెడ్యూల్ ను హంసల దీవిలో ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. “నిన్నటితో హైద్రాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఏప్రిల్ 21 నుంచి హంసల దీవిలో రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించనున్నాం. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా నేటి నుంచి మొదలయ్యాయ్. బెల్లంకొండకు మాస్ హీరో ఇమేజ్ ను తీసుకురావడంతోపాటు స్టార్ హీరోగా నిలబెట్టేందుకు బోయపాటి ఆహారహం శ్రమిస్తున్నారు” అన్నారు.

జగపతిబాబు, వాణి విశ్వనాథ్, ఎస్తేర్, సితార, సుమన్, నందు, శశాంక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!