ల్యాప్‌టాప్ పగిలింది.. ల‌క్ష్మ‌ణ్‌కి కోపమచ్చింది ‌!

136
Shikhar Dhawan destroys tactical laptop
Shikhar Dhawan destroys tactical laptop

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన భారీ షాట్‌కు సన్ రైజర్స్ జట్టుకు చెందిన కీలక ల్యాప్ టాప్ పగిలింది.సన్ రైజర్స్ కోచ్ లక్ష్మ‌ణ్ సీరియ‌స్ అయ్యాడు. కానీ అత‌ను సీరియ‌స్ అయింది ధావ‌న్‌పై కాదు… టీమ్ అన‌లిస్ట్‌పై..

కోల్‌క‌తాతో మ్యాచ్ సంద‌ర్భంగా ధావ‌న్ కొట్టిన క‌ట్ షాట్తో‌.. డగౌట్‌ వైపు వేగంగా వచ్చిన ఆ బాల్‌ ల్యాప్‌టాప్‌ వెనక భాగాన్ని బలంగా తాకింది. బాల్ త‌న‌వైపు వేగంగా రావ‌డాన్ని గ‌మ‌నించి ఓ అన‌లిస్ట్‌.. సీట్‌లో నుంచి లేచి ప‌క్క‌కు ప‌రుగెత్తాడు. బంతి వచ్చినప్పుడు ల్యాప్ టాప్ ముందు కూర్చున్న వ్యక్తి తప్పుకొన్నాడు కానీ దానిని రక్షించలేదు. దీంతో లక్ష్మణ్‌ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ల్యాప్‌టాప్‌లో చూసే కోచ్‌, ఇత‌ర సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు మ్యాచ్‌కు సంబంధించి వ్యూహాలు ర‌చిస్తారు.