రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బిసి కమిషన్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అంబర్ పేట లోని తన నివాసం దగ్గరలోని పార్క్ లో మొక్కలు నాటి పదవి బాధ్యతల స్వీకరణకు బయలు దేరిన తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్..
ఈ సందర్భంగా బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా TRS పార్టీ విద్యార్థి ఉద్యమ నాయకునిగా పనిచేసిన నాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యునిగా నియమించడం జరిగిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో టీమ్ సభ్యుడిగా ఉంటూ గత నాలుగు సంవత్సరాలుగా పనిచేసి ఏ సందర్భం వచ్చిన మొక్కలు నాటే చైతన్యాన్ని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి మార్గదర్శకంలో ప్రజల్లో తీసుకురావడం జరిగిందని తెలిపారు.ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టే ముందు నీను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మంచి శుభకార్యం జరిగినప్పుడు ఇదేవిధంగా మొక్కలు నాటే అలవాటును చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఈ పదవి కి న్యాయం చేస్తానని బీసీల సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడుతాను అని తెలిపారు. నా నియామకానికి సహకరించిన మంత్రి కేటీఆర్ గారికి, రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క గారికి, జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారికి, మిగతా ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో TRSV విద్యార్థి నాయకులు అనిల్ గౌడ్, సాయి కుమార్, శ్యామ్, కరాటే శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు తదితరులు పాల్గొన్నారు