గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న బీసీ కమిషన్ సభ్యులు..

28
challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వికారాబాద్ ఆలంపల్లి లో కేసీఆర్ సేవదళ్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ హాజరై జమ్మి మొక్కను నాటారు.

విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును నాటడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని శుభప్రద్ పటేల్ తెలిపారు. చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ప్రతీ ఊరిలో ఉండాలనే తలంపుతో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుర్లపల్లి మంజుల, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.