మళ్లీ పెరిగిన సిలిండర్ ధరలు..

101
gas

వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సెప్టెంబ‌ర్ మాసానికి సంబందించి ధ‌ర‌లు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.25, వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.75 పెంచిన‌ట్టు గ్యాస్ కంపెనీలు వెల్లడించాయి.పెరిగిన ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ఢిల్లీలో వంట‌గ్యాస్ ధ‌ర రూ.884.50కి చేర‌గా, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.1693కి చేరింది. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వినియోగదారులు ఆందోళ‌న‌లు చెందుతున్నారు. ఓ వైపు పెట్రోల్ మరోవైపు వంటగ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులపై పెనుభారం పడుతోంది.