మొక్కలు నాటిన రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్..

63
- Advertisement -

పుట్టిన రోజును ఘనంగా సంబురాలు జరుపుకోవడం గొప్ప కాదని, పుట్టుకకు సార్థకతను చేకూర్చుకునే పనులను చేసినప్పుడే జీవన సాఫల్యం అని రాష్ట్ర బి.సి.కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఈరోజు ఆయన 51వ జన్మదినాన్ని వారి కుటుంబ సభ్యులు మరియు బి.సి.కమిషన్ సభ్యులు సి.హెచ్.ఉపేంద్ర, కె.కిషోర్ గౌడ్, అధికారులు, కార్యాలయ సిబ్బందితో కలిసి నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఖైరతాబాద్ లోని రాష్ట్ర బి.సి.కమిషన్ కార్యాలయంలో జరిగింది.

జన్మదినం సందర్భంగా ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులు, బంధుమిత్రులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందజేశారు. పూలమాలలతో, శాలువాలతో సత్కరించారు. బర్త్ డే కేక్ లను ఆయనతో కట్ చేయించారు. ఈ సందర్భంగా, బి.సి.కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటినట్లు ఆయన తెలిపారు. మొక్కలు నాటడం ఒక సంప్రదాయంగా కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని డా.వకుళాభరణం ప్రశంసించారు.

- Advertisement -