బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 24 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 24వ ఎపిసోడ్లో భాగంగా కెప్టెన్సీ టాస్క్‌లు, రాజ్, ఇనయ రొమాన్స్‌తో రెచ్చిపోయారు. తొలుత కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ లో బిగ్‌బాస్ హోటల్ స్టాఫ్ కంటే గ్లామ్ రెస్టారెంట్ స్టాఫ్ వద్ద ఎక్కువ మనీ ఉండటంతో వాళ్లు విన్నర్స్ అయ్యారు. దీంతో బిగ్‌బాస్ హోటల్ని స్వాధీనం చేసుకున్నారు.
సీక్రెట్ టాస్క్ చేయడంలో చంటి విఫలం కావడంతో ఈ వారం కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు బిగ్‌బాస్. ఇక కంటెస్టెంట్స్ లో ఉన్న అమ్మాయిల్లో ఫైమా, శ్రీ సత్య, వసంతి, ఆరోహి, కీర్తి కలిసి రెండు హోటల్స్ నుంచి ఒక్కొక్కరిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించమనడంతో అందరూ కలిసి రేవంత్, బాలాదిత్యలను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించారు.
ఇక రాత్రి… రాజ్, ఇనయ ఒకే బెడ్‌పై పడుకొని దుప్పటి కప్పుకొని రచ్చచేశారు. ఇక భార్య భర్తలు మరీనా, రోహిత్ లు కూడా బెడ్ పై హగ్ చేసుకొని పడుకున్నారు.