- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 4272 కరోనా కేసులు నమోదుకాగా 27 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,45,83,360కి చేరగా 4,40,13,999 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 40,750 కేసులు యాక్టివ్గా ఉండగా ఇప్పటివరకు కరోనాతో 5,28,611 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.09 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 218.17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -