అఖిల్ వ‌చ్చే వరకు ఇంటికి వెళ్లనంటున్న మోనాల్..

40
Monal copy

ఈ సారి బిగ్‌ బాస్ హౌజ్‌లోని జంట ప‌క్షుల్లో అఖిల్, మోనాల్ ఒక‌రు. షోలోకి వెళ్లిన మొద‌ట్లో ఇటు అభిజీత్, అటు అఖిల్ ఇద్ద‌రితో మోనాల్ క్లోజ్‌గా ఉండేది. ఈ ముగ్గురి మ‌ధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డిచింది. ఈ క్ర‌మంలో మోనాల్ విష‌యంలో అభి, అఖిల్ మధ్య చాలాసార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. కానీ ఆ త‌రువాత‌ ఆమె ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క అభి దూరంగా వెళ్లాడు. అయితే మోనాల్, అఖిల్‌లు మాత్రం చాలా క్లోజ్‌గా ఉండేవారు. కాగా మోనాల్‌ ఇటీవ‌లే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిపిందే.

అయితే అఖిల్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వరకు తాను అహ్మ‌దాబాద్ వెళ్ల‌న‌ని చెప్పింది. అఖిల్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వచ్చే దాకా తాను హైద‌రాబాద్‌లో ఉంటాన‌ని చెప్పింది. ఇక మ‌రోవైపు న‌గ‌రంలోనే ఉంటున్న మోనాల్ ద‌గ్గ‌ర‌కు సినిమా ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నాయ‌ట‌. ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌మ సినిమాల్లో న‌టించాల‌ని మోనాల్ ను సంప్ర‌దిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.