లుంబినీ పార్క్‌ను సందర్శించిన మంత్రి శీనివాస్ గౌడ్..

50
minister srinivas goud

ఈ రోజు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి శీనివాస్ గౌడ్ హైదరాబాద్‌ లుంబినీ పార్క్‌ను సందర్శించారు. ఆకస్మిక పర్యటనకు విచ్చేసిన మంత్రి లుంబినీ పార్క్‌లో కొత్త ఎర్పాటు చేయనున్న క్రూస్ బోట్ నిర్మాణ పనులు పరిశీలించారు. రెండఅంతస్తుల బోట్‌లో అంతా కలియ తిరిగి, అలాగే డీలక్స్ బోట్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఎండీ మనోహర్ రావు, జీఎం ఇబ్రహీం పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అనేగానే హుస్సేన్ సాగర్, బుద్దిని విగ్రహం సింబాలిక్ గా గుర్తుకు వస్తాయి. హుస్సేన్ సాగర్‌లో ఈరోజు కొత్తగా ఎలక్ట్రానిక్ క్రుజర్, బోట్ ఏర్పాటు చేశాము. ఇది మరో 5 నెలలో పూర్తి అవుతుంది. ఇందులో బర్త్ డే,ఇతర వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే దుర్గం చెరువులో కూడా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రెండు బోట్స్ ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా కూడా టూరిజం స్పాట్ గా అవతరిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత విదేశీ టూరిస్ట్ ల సంఖ్య పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో కొంత తగ్గిన మళ్ళీ పుంజుకుందని మంత్రి వెల్లడించారు.

ఇక యాదాద్రి ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయితే అక్కడ విదేశీ టూరిస్ట్ లను ఆకట్టుకుంనేందుకు మరింత అద్భుతమైన టూరిజం స్పాట్ ఏర్పాటు కాబోతుంది. రానున్న కొద్దిరోజుల్లో సోలార్,ఎలక్ట్రిక్ బోట్ లను అందుబాటులోకి తెస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మనకు సముద్రంలా నీళ్లు ఉన్నాయి. వాటిలో కూడా టూరిజంను అభివృద్ధి చేస్తాం. మూవింగ్ రెస్టారెంట్ 80 సీట్లతో సోలార్ క్రుజర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.