సూర్యపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

707
bathukamma
- Advertisement -

సూర్యపేట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మంత్రి సతీమణి సునీతా జగదీష్ ఆధ్వర్యంలో బతకమ్మలను పేర్చిన మహిళలు సద్దుల చేరువు వద్ద పట్టణ నలుమూలల నుండి వచ్చిన మహిళ లతో కలిసి చప్పట్లు వేస్తూ ఎంగిలి పూవు బతుకమ్మ ఆడారు సునీతా జగదీష్ రెడ్డి.

నేటి నుండి 9 రోజుల పాటు సూర్యాపేట మున్సిపాలిటీ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరగనున్నాయని ఈ సందర్భంగా సునీతా జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బతుకమ్మ పండుగ…సూర్యాపేట నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర మహిళ లకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ ఆయుఆరోగ్యాలు.. అష్ట ఐశ్వర్యాలు సిద్దించాలని గౌరీ దేవి అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. పట్టణంలోని సద్దుల చెరువు , రైతు బజార్ ప్రాంతాలతో పాటు పట్టణంలో లో ఏ ప్రాంతం లో చూసినా తొలి రోజు బంగారు బతుకమ్మ లతో సూర్యాపేట బంతి పూల వనం లా మారిందన్నారు.

బతుకమ్మ పండుగ కు రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల కు చీరేలు పంపిణీ చేయడం సీఎం కేసీఆర్ కు మహిళ ల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం…ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు జీవితానికి ఎలాంటి ఆపద రాకుండా ఆత్మస్థైర్యంతో నిండు నూరేళ్లు బతుకు పండుగలా సాగాలని గౌరీమాతను పూజించడమే బతుకమ్మ పండుగ ప్రత్యేకత అన్నారు. ప్రకృతి నుండి వచ్చిన పూలను దేవుడిగా పూజించడం అనేది ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. ఒక్క తెలంగాణలో మాత్రం బతుకమ్మ పేరుతో పూలను పూజించే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందన్నారు. సూర్యాపేటలో నేటి నుండి 9 రోజుల పాటు రోజుకో ప్రాంతంలో బతుకమ్మ పండుగలా నిర్వహిస్తాం అన్నారు.

- Advertisement -