చేపమందు..చరిత్ర

70
- Advertisement -

హైదరాబాద్ చేప ప్రసాదం పంపిణీ గురించి తెలియని వారుండరూ. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ పెద్ద ఎత్తున జరగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తరలివస్తారు.

బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 173 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్‌ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది.

Also Read:మిస్ వరల్డ్ వేదికకు సిద్ధమైన భారత్‌..

నిజాంల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు. వరుసగా మూడు సంవత్సరాల పాటు చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే అస్తమా నయమవుతుందనేది బత్తిని బ్రదర్స్ వాదన.

ఇక మృగశిర కార్తెలో చేపలను తినడానికి ఓ కారణం ఉంది. మృగశిర కార్తె ప్రవేశించడంతో రోకండ్లను సైతం పగుల గొట్టే ఎండలు వెళ్లిపోతాయి. వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలోనూ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. తద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు చేపలల్లో పుష్కలమైన పౌష్టికాహార పదార్థాలు ఉండటం కూడా చేపలు తినడానికి ఓ కారణం.

Also Read:అన్ స్టాపబుల్ ఎంటర్ టైనర్: చిత్ర యూనిట్

- Advertisement -