కిలిమంజారోపైన తెలంగాణ ఖ్యాతి…

57
- Advertisement -

ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం శిఖరం మరియు ఇది టాంజానియాలో ఉన్న ఒక నిద్రాణమైన అగ్ని పర్వతమైన కిలిమంజారోను తెలంగాణకు చెందిన గిరిజన విద్యార్థి బానోతు వెన్నెల విజయవంతంగా ఆధిరోహించింది. ఇది సముద్ర మట్టానికి 19,341అడుగుల ఎత్తున ఉంది. ఈమె స్వగ్రామం తెలంగాణలోని కామారెడ్డి మండలం సోమవారం పేట.

టాంజానియాలోని కిలిమంజారో (5895మీటర్లు) పర్వతాన్ని ఈ నెల 19న ప్రారంభించి జనవరి 26న చేరుకుంది. అయితే బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌ వెన్నెలకు రూ.3,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బానోతు వెన్నెల సీఎం కేసీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ వెన్నెలను అభినందించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు వెన్నెలకు అభినందించారు.  బానోతు వెన్నెల తన కుటుంబానికి మాత్రమే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి కూడా కీర్తిని తెచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా మరెన్నో ఇలాంటి ఫీట్‌లు సాధించాలని అన్నారు. గతంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యేముల నితిన్‌ ఈ ఫీట్‌ను సాధించారు.

ఇవి కూడా చదవండి…

నాగలి కాదు రాజ్యాంగాన్ని నడిపించాలి…

గోవింద స్థానంలో టీటీదేవస్థానమ్స్ యాప్‌

తెలంగాణ విద్యార్థి ప్రశ్న..మోదీ ఆన్సర్

- Advertisement -