వాయు కాలుష్యం…ప్రాక్టీస్‌లో భారత్-బంగ్లా క్రికెటర్లు

571
india vs bangladesh
- Advertisement -

ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఈ ప్రభావం భారత్-బంగ్లా టీ20 మ్యాచ్‌పై పడే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా ఇరు జట్ల క్రికెటర్లు కాలుష్యంలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్‌ చేసే క్రమంలో ముఖానికి పొల్యూషన్‌ మాస్క్‌లు ధరిస్తున్నారు క్రికెటర్లు.

వాయు కాలుష్యం ఉన్నప్పటికీ భారత్-బంగ్లా క్రికెటర్లు ముమ్మర సాధన చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కసరత్తులు చేశారు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి ఇక్కడి వాయు నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిని చూపిస్తోంది.

delhi

ఒకవైపు ఢిల్లీలోని ప్రజలను అవరసమైతే తప్పితే బయటకు వెళ్లవద్దని డాక్టర్లు సూచించిన సందర్భంలో క్రికెటర్లు మాత్రం ఎలా ఆడతారనే సందేహాలు నెలకొన్నాయి. అయితే వాయు కాలుష్యం ఎలాఉన్నా మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు.

- Advertisement -