శ్రీరాం సాగర్ పునరుజ్జీవన పథకం ఫలితాలు అందుతున్నాయని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి ..తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఒక్క ఆరోపణలు కూడా లేకుండా పనిచేస్తున్నాం…రైతులకు సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేస్తున్నారని వెల్లడించారు.పేదల మేలు కోసం రూ.2 వేలు ఫించన్ ఇస్తున్నారు….దసరా పండుగకు ఒక అన్నలా, ఓ మేనమామలా బతుకమ్మ చీరలను సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు.డబ్బుల ఇబ్బంది ఉన్నా… పేదలు, రైతులకు సంబంధించిన స్కీంలు మాత్రం ఆగటం లేదన్నారు.
సీఎం కేసీఆర్ ..గొళ్ల ,కుర్మల అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి .ఆరోగ్యవంతమైన గొర్రెలను పంపిణీ చేస్తున్నాం.కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు.సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు.