దేవుళ్ల పేరుతో రేవంత్ రాజకీయ చిచ్చు!

0
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల పేరుతో సమాజంలో రాజకీయ చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల రాజకీయం కోసం రాముడు, శివుడి మధ్య కూడా విభజన రేఖలు గీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… “శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు” అని వ్యాఖ్యానించడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దేవుళ్లను ఇలా విభజించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ, దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం వంటి దివ్య క్షేత్రాలు ఉన్న తెలంగాణ నేలపై దేవుళ్ల పేరిట ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజలను విడగొట్టిందని.. ఇప్పుడు ఓట్ల కోసం దేవుళ్లను కూడా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

Also Read:చైనాకు అమెరికా ఆయుధాలు!

సమాజాన్ని ఐకమత్యంగా ఉంచాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రే స్వయంగా భక్తుల భావోద్వేగాలను దెబ్బతీసేలా మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉందని, కాంగ్రెస్ పార్టీ తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -