ఫ్యూచర్‌ సిటీ పేరుతో భూముల అమ్మకం!

0
- Advertisement -

ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతుల భూములను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. టన్నుకు ₹ 3,800 చొప్పున లభించే సింగరేణి బొగ్గుకు నో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

టన్నుకు ₹ 9,000 ఖరీదు చేసే విదేశీ బొగ్గు దిగుమతులకు మాత్రం యస్ చెప్పడం..కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరొక తుగ్లక్ నిర్ణయం ఇది అన్నారు.ఎవరి ప్రయోజనాల కోసం ఇది చేస్తున్నారు? ఈ భారాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు మోయాలి?..దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతం తెలంగాణ; సింగరేణి కాలరీస్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మహారాష్ట్రలకు కూడా బొగ్గు సరఫరా చేస్తుంది.కెసిఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో, తెలంగాణ జెన్‌కో సింగరేణి బొగ్గును ఉపయోగిస్తూ ఉత్పత్తి చేసిన విద్యుత్‌తో మేము 24 గంటల ఉచిత మరియు నిరంతర విద్యుత్ సరఫరాను అందించాము అని గుర్తు చేశారు.

 

Also Read:సిరిసిల్ల క్రికెటర్‌ అక్షరకు కేటీఆర్ అండ

- Advertisement -