గడచిన 2016 సంవత్సరం విప్లవాత్మక సంవత్సమన్నారు కేంద్ర కార్మిక మరియు ఉపాధికల్పనశాఖామాత్యులు బండారు దత్తాత్రేయ. సర్జికల్ స్ట్రైక్ లు, డిమోనిటైజేషన్ మొదలగు సాహసోపేత చర్యలు తీసుకొన్న మరపురాని, మరువలేని సంవత్సరం. ఈ 2016 సంవత్సరం హిమాలయాలనుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు దేశప్రజలందరిని ఏకం చేసి ఆలోచింపజేసింది. శాంతి, సామరస్యం, ప్రజాహితం పరంగా 2016 మన మదిలో ఒక మైలు రాయిగా నిలిచిందన్నారు.
2016 కు వీడ్కోలు పలికి 2017 లో అడుగిడుతున్నాము. 2017 ఒక నిర్మాణాత్మక సంవత్సరం గా, అవినీతి,నల్లధనం,ఉగ్రవాద అంతంలో వేగమైన మార్పు తెచ్చే సంవత్సరంగా మారబోతుందన్నారు బండారు దత్తాత్రేయ. మన అసంఖ్యాక మానవ వనరులు ఒక వరంగా మారుటకు , డెబ్భై కోట్ల యువత నైపుణ్యాభివృద్ధిలో ముందుండుటకు, , రైతుల ఆదాయం రెట్టింపయ్యే దిశలో చర్యలు, కార్మికులకు కనీస వేతనాలతో పాటు, అసంఘటితరంగ కార్మికులకు సాంఘీక, వేతన,ఉద్యోగ భద్రత లభించే చర్యలు చేపడతామన్నారు. నాణ్యమైన విద్య పేదలందరికీ గృహాలు అందజేయడంలో చర్యలు ఈ సంవత్సరంలో ఉంటాయన్నారు.
2017 లో భారత్, ప్రపంచములో ఒక అగ్రగామి దేశంగా, ఏక్ భారత్ – శ్రేస్ట్ భారత్ గా రూపొందాలని ప్రార్ధిస్తూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేయుచున్నాను అని తెలిపారు.