తారాగణం: జైద్‌ఖాన్, సోనాల్ మెంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్‌కుమార్, సప్నారాజ్
సంగీతం: అంజనీష్ లోక్‌నాథ్
రచన, దర్శకత్వం: జయతీర్థ
నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
వెండితెరకు పొలిటికల్ నేపథ్యం వున్న కుటుంబం నుంచి పరిచయమైన మరో హీరో జైద్‌ఖాన్. కర్ణాటకలో సీనియర్ రాజకీయ నాయకుడు జమీర్ అహ్మద్ కుమారుడు జైద్‌ఖాన్ నటించిన చిత్రం బనారస్. విజయవంతమైన చిత్రం బెల్‌బాటమ్ దర్శకుడు జయతీర్థ దర్శకత్వం వహిస్తుండటం.. ఆర్థికంగా కావాల్సిన వనరులు.. కావాల్సిన సాంకేతిక నిపుణులు సమాకూర్చగలిగిన నిర్మాత వుండటంతో బనారస్‌ను కంటెంట్‌తో పాటు రిచ్‌గా తీర్చిదిద్దుతారని అంచనా వేశారు అందరూ.
బనారస్ శుక్రవారం నవంబరు 4న పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బనారస్ జనాదరణ పొందే చిత్రంగా వుందా? లేదా అనేది తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే..!
కథ
సిద్ద్ (జైద్‌ఖాన్) ధనవంతుల కుటుంబానికి చెందిన అల్లరి కుర్రాడు. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో సిద్ద్‌కు అంతా నాన్నే. స్నేహితులతో విసిరిన చాలెంజ్ కోసం ధని (సోనాల్) అనే అమ్మాయిని తను టైమ్‌ట్రావెల్‌లో వున్నానని ట్రాప్ చేస్తాడు. ఆ అబద్ధంతో పాటు సిద్ధ్ చేసిన ఓ పనికి ధని చాలా అవమానాలు ఎదుర్కొని బనారస్‌కు వెళ్లిపోతుంది. ఆమెకు క్షమాపణ చెప్పడం కోసం అక్కడికి వెళ్లిన సిధ్ద్‌కు బనారస్‌లో చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. అనుకోకుండా టైమ్ లూప్‌లో చిక్కుకొంటాడు. ఆ టైమ్‌లూప్‌లో ఎందుకు చిక్కుక్కున్నాడు అసలు కారణమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ
గతంలో మనం తెలుగులో టైమ్‌ట్రావెల్ కథలతో కొన్ని సినిమాలు చూశాం. అయితే టైమ్ లూప్ అనేది కాస్త విభిన్నమైన కథ. ఇటీవల దర్శకుడు వెంకట్‌ప్రభు టైమ్‌లూప్ కాన్సెప్ట్‌ని మానాడు చిత్రంలో చూపించాడు. అలాంటి తరహా కాన్సెప్టే ఇది. బనారస్ కథ కూడా మొదలుకావడం కాస్త ఆసక్తిగా మొదలైంది. ఒకానొక సమయంలో సిద్ధ్ చెప్పే టైమ్‌ట్రావెల్ కథ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా ఎందుకో ఆ తర్వాత కథానాన్ని అంత ఆసక్తిగా నడిపించలేకపోయాడు దర్శకుడు.
టైమ్‌లూప్ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నప్పుడు ప్రతిది లాజిక్‌గా వుండాలి. కథనం టైమ్‌టేకేన్‌లా కాకుండా స్పీడ్‌గా వుండాలి.. అది సినిమాలో లోపించింది. కథ కాన్సెప్ట్‌లో వున్న నవ్యత దానిని నడిపించడంలో కొరవడింది. సిద్ద్, సోనాలి మధ్య జరిగే లవ్‌స్టోరీ కూడా రొటిన్‌గా వుంది. లవ్‌స్టోరీలో ఫ్రెష్‌నెస్ వుంటే ఇంకాస్త బాగుండేది.
సిద్ధ్ నటనపరంగా ఫర్వాలేదనిపించాడు.నటనలో ఇంవ్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. బనారస్‌లో కనిపించే శంభు పాత్ర కొత్తగా వుంది. అతని మాటలో చమత్కారంతో పాటు ఫిలాసఫీ కనిపిస్తుంటుంది. ఈ టైమ్‌లూప్ కాన్సెప్ట్‌ని కొత్తకోణంలో మరింత ఆసక్తికరంగా చెబితే బాగుండేది. సెకండాఫ్‌లో ఒకే సీనును మళ్లీ మళ్లీ చూసినట్లుగా అనిపిస్తాయి. నూతన హీరోతో చేసిన సినిమాకు కనీసం మినిమమ్ పబ్లిసిటి కూడా లేకుండా సినిమాను విడుదల చేయడం కూడా ఈ చిత్రానికి మైనస్‌గా మారింది..!
ఇవి కూడా చదవండి..
రివ్యూ: ఊర్వశివో రాక్షసివో
కాంతారపై ప్రశంసలు..ఈసారి ఏబీడీ వంతు
వాల్తేర్‌లో… ఊర్వశి ఆట పాట