రివ్యూ: ఊర్వశివో రాక్షసివో

295
shirish
- Advertisement -

రాకేశ్‌ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం “ఊర్వశివో రాక్షసివో”.శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా యూత్, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి ఈ సినిమాతో శిరీష్ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ :

శ్రీ కుమార్(శిరీష్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇక సిరి(అను ఇమ్మాన్యుయేల్) ఓ పెద్దింటి అమ్మాయి. ఇద్దరి ఆలోచనలు వేర్వేరుకాగా వీరిద్దరి మధ్య పెళ్లి, రిలేషన్ షిప్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ప్రపోజల్స్ వస్తుంది. ఇలాంటి ఇద్దరి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అది పెళ్లి వరకు వెళ్తుందా లేక లివ్ ఇన్ రిలేషన్ లోనే ఆగుతుందా? చివరకి కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటన,కామెడీ. శిరీష్ నటనలో చాలా పరిణితి కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ లో సీన్స్‌లో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ అను ఇమ్మానుయేల్ చాలా కాలం తర్వాత మంచి నటనతో ఆకట్టుకున్నారు. తన నటనతో పాటు గ్లామర్‌తో సినిమాకు మరింత ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, కేదార్ శంకర్ లు తమ పాత్రలకి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ లవ్ స్టోరీ ని కామెడీ పక్కదారి పట్టించినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ని మరింత బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం :

సాంకేతికంగా సినిమా సూపర్బ్. పాటలు సహా సినిమా అంతా మంచి విజువల్స్, సెటప్ తో కనిపిస్తాయి. తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉంది. అలాగే కార్తీక్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. ఇక దర్శకుడు రాకేష్ విషయానికి వస్తే తాను చెప్పదలుచుకున్న పాయింట్‌ని సూటిగా చెప్పడంలో సక్సెస్‌ అయ్యారు. ఓ కీలక పాయింట్ ని పట్టుకొని కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని పండించిన విధానం బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు :

ఏబీసీడీ తర్వాత అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో. చాలాకాలం తర్వాత యూత్, లవ్ ఎంటర్‌టైనర్‌తో రాగా కథనం, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని అంశాలు మినహాయిస్తే ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం ఊర్వశివో రాక్షసివో.

విడుదల తేదీ : 04/11/ 2022
రేటింగ్ :2.75/5
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్
సంగీతం: అచ్చు, అనూప్ రూబెన్స్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం
దర్శకుడు : రాకేష్ శశి

ఇవి కూడా చదవండి..

ఒకే సారి 32 మందితో వీడియో కాల్‌!

ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

బిచ్చగాడు-2 ఎప్పుడంటే…

- Advertisement -