రానాతో బాలయ్య మల్టీస్టారర్ మూవీ..!

115
rana

గతేడాది దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో కలిసి నటించిన బాలకృష్ణ, దగ్గుబాటి రానా మరోసారి వెండితెర పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి వీరిద్దరూ పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోసియుమ్’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. అయప్పనుమ్ నాయర్ అనే పోలీసు అధికారి, రిటైర్డ్ హవల్దార్ కోషి కురియన్ మధ్య జరిగే ఈగో వార్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో మంచి హిట్టయింది.

అయ్యప్పనుమ్ కోసియుమ్ చిత్రంలో బిజు మీనన్‌, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించ‌గా తెలుగు రీమేక్‌లో బిజు మీన‌న్ పాత్ర‌లో బాల‌కృష్ణ‌, పృథ్వీరాజ్ పాత్ర‌లో రానా క‌నిపించ‌నున్నార‌ని అంటున్నారు. మ‌ల‌యాళంలో మంచి హిట్ అయిన ఈ చిత్రం తెలుగులోను సూప‌ర్ స‌క్సెస్ సాధిస్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది.