టీడీపీ పగ్గాలు బాలయ్య చేతికి?

43
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుత్మున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ కావడంతో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధినేత జైలు పాలు కావడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తాడనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో టీడీపీ నాయకత్వంపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం బాబు లేకపోవడంతో పార్టీని ముందుండి నడిపించే బాద్యత ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
తాజా పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు స్థానంలో నందమూరి బాలకృష్ణ ఆ బాద్యతలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాబు అరెస్ట్ అయిన తరువాత నుంచి పార్టీ వ్యవహారాల్లోనూ.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలలోనూ బాలయ్య ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక తాజాగా మంగలగిరి పార్టీ ఆఫీస్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read:Kavitha:జగిత్యాల నుండే బిఆర్ఎస్ జైత్రయాత్ర

జగన్ పాలనలో అరాచకం కొనసాగుతోందని, గతంలో ఆయన జైలుకు వెళ్లొచ్చారని, ఇప్పుడు అందరినీ కక్ష పూరితంగా జైలుకు పంపిస్తున్నారని బాలయ్య ఫైర్ అయ్యారు. జగన్ ఆటలు సాగనివ్వనని కూడా హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా మారేందుకు సిద్దమయ్యారా అనే అభిప్రాయం రాక మానదు. చంద్రబాబు కూర్చునే ఛైర్లోనే కూర్చోవడం.. బాబు మాదిరే టీడీపీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయడంలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు బాలయ్య. ఇక వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాలకు గుడ్ బై చెబుతాని బాబు ప్రకటించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే బాలయ్య ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు కొందరు. అయితే నారా లోకేశ్ కూడా టీడీపీ పగ్గాలు అందుకునేందుకు రెడీగా ఉన్నారు. మరి ముందు రోజుల్లో చంద్రబాబు తరువాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారో చూడాలి.

Also Read:Harishrao:సతీష్ బాబును గెలిపించండి

- Advertisement -