బాలనటుడు సాయి మృతి…బాలయ్య భావోద్వేగం

656
nbk
- Advertisement -

బాలనటుడు గోకల్ సాయికృష్ణ మృతిపై స్పందించారు నందమూరి బాలకృష్ణ. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అతని కుటుంబానికి ఫేస్ బుక్‌ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డెంగీ కారణంగా బాల నటుడు గోకుల్ సాయికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ వీరాభిమాని అయిన గోకుల్ బాలయ్య నటించిన చిత్రాల్లోని పలు పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ అందరిని ఆకట్టుకున్నాడు. గోకుల్‌ని అంతా జూనియర్ బాలయ్య అని కూడా పిలుస్తుంటారు. గోకుల్ మృతిపై బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -