బాలయ్య మనసుకు అలేఖ్య కృతజ్ఞతలు

32
- Advertisement -

గుండెపోటుతో అకాల మరణం చెందిన నందమూరి తారకరత్నపై తనకున్న ప్రేమను నందమూరి బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదనే ఉద్దేశంతో హిందూపురంలో నిర్మించిన ఆసుపత్రిలో గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా సర్జరీలు చేయించనున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని H బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. ఈ ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా మందులు, భోజనం సౌకర్యం కల్పించనున్నారు.

కాగా హిందూపూరంలోని ఆసుపత్రిలో ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టిన నేపథ్యంలో తారకరత్న భార్య అలేఖ్యా బాలకృష్ణపై ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ ఫొటో పోస్ట్ చేసింది. ‘మీపై నాకున్న కృతజ్ఞతను ఎలా చెప్పగలను. మీ మనసు బంగారం. మిమ్మల్ని ఓ తండ్రిగా, స్నేహితునిగానే చూశాం. కానీ, ఇప్పుడు మీలో దేవుడిని చూస్తున్నాం’ అంటూ పోస్ట్‌ చేసింది.

మొత్తానికి బాలయ్య తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. నందమూరి తారకరత్న మరణానంతరం ఆయన కుటుంబానికి బాలయ్య అండగా నిలబడిన విధానం నిజంగా గొప్ప విషయం. అలాగే హిందూపురంలో బాలయ్య నిర్మించిన ఆసుపత్రిలో నిత్యం గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా సర్జరీలు చేస్తున్నారు. ఆ ఖర్చు అంతా బాలయ్యే పెట్టుకుంటుండటం విశేషం.

ఇవి కూడా చదవండి…

ఐరా క్రియేషన్స్‌లో త్రినాథరావు కొత్త సినిమా..

ఎన్టీఆర్ తో ఓ చెడ్డవాడి కథ!

‘భోళా శంకర్’ రిలీజ్ ఎప్పుడంటే ?

- Advertisement -